కర్నూల్ జిల్లా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హాజ్‌మున్నీ(15) అనే విద్యార్థిని శుక్రవారం గుండెజబ్బుతో కన్నుమూసింది. ఆమె మృతితో పాఠశాలలో విషాదం నిండింది. మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఈమె మృతిని స్నేహితురాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాఠశాలలోనే బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువు, క్రీడల్లో రాణింపు: హాజ్‌మున్నీని గుండెజబ్బు వెంటాడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. …
Read More »