అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… …
Read More »తెలంగాణలో అత్యధికంగా ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల్లో 10 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వీరిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, నారాయణరెడ్డి, ప్రకాశ్, కడియం, కోటిరెడ్డి, సత్యవతిరాథోడ్, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీల్లో యెగ్గె మల్లేశం(రూ.126.83 కోట్లు) తొలిస్థానంలో, కవిత (రూ. 39.79 కోట్లు) 4వ స్థానంలో నిలిచారు. అత్యధిక అప్పులున్న …
Read More »రాజాసింగ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి
ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన …
Read More »నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రోజు గురువారం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికోసం ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టరేట్ …
Read More »మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.
Read More »BJP నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ ఔట్
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. బీజేఎల్పీ నేత రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధిష్టానం ప్రకటించింది. మహ్మద్ ప్రవక్త గురించి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయకూడదో పదిరోజుల్లో అంటే సెప్టెంబర్ 2 వరకు వివరణ ఇవ్వాలని కోరింది.
Read More »సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున రంగారెడ్డి జిల్లాలో పర్యటనలో జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సీపీ …
Read More »సీఎం కేసీఆర్ పై కుట్రతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు
కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో ఒకే ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అనీ, బీజేపీ మోసాలను అన్ని వేదికల్లోనూ ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ, అమిత్ షాలకు వణుకుపుడుతోందన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని నడుస్తున్నదని మోదీ ప్రభుత్వం కాదని.. ఏడీ (అటెన్షన్ డై వర్షన్) …
Read More »మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి …
Read More »దేశాన్ని ఉన్మాదంలోకి నెట్టే కుట్ర
75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకొంటున్న ఈ నేపథ్యంలో దేశాన్ని ఒక ఉన్మాద స్థితిలోకి నెట్టే కుట్ర జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విష సంస్కృతిని చూస్తూ ఊరుకొంటే అది దేశానికే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సోమవారం లాల్‌బహదూర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి …
Read More »