తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ
Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …
Read More »ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …
Read More »సీఎం కేసీఆర్‌పై షర్మిల్ సెటైరికల్ ట్వీట్
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ ట్వీట్ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్ బరస్ట్’పై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …
Read More »పాలేరు నుండి బరిలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19న నేలకొండపల్లిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో వైఎస్ షర్మిల పాలేరుపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Read More »అంచెలంచెలుగా ఎదిగిన మల్లాది సందీప్ – వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియామకం
మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్‌ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ …
Read More »పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila
ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »వైఎస్ షర్మిలకు బిగ్ షాక్
తెలంగాణలో ఇటీవల కొత్తగా వచ్చిన వైఎస్ఆర్‌టీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో ఆమె తెలియజేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె పంపారు. అసలు ఎందుకు రాజీనామా చేయాలని అనుకున్నారు..? రాజీనామా వెనుక అసలు కారణాలేంటి..? రాజీనామా చేసిన తర్వాత …
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్
తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో …
Read More »