ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అధికార వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘రెండున్నరేళ్లుగా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా. నేనేమిటో ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు …
Read More »టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ …
Read More »టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …
Read More »లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …
Read More »నారా లోకేష్ పాదయాత్రకు కండిషన్లు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ …
Read More »చంద్రబాబు ,లోకేష్ లకు ప్రాణహాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్‌కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై …
Read More »కల్లు గీత కార్మికులకు రూ.10 లక్షలు
ఏపీలో కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే రూ.10,00,000 పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ బీమా పథకం కింద రూ.5,00,000, ఎక్స్రేషియా రూపంలో మరో రూ. 5,00,000 చెల్లించనుంది. కాగా, కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10,00,000 పరిహారం అందిస్తోంది. తాజాగా శాశ్వత వైకల్యం బారిన పడినా రూ.10 …
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …
Read More »ఈనెల 27న నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. జగన్ గురువారం ఉదయం 9:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, 10:55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11:10 గంటల నుంచి …
Read More »2024 ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు..?
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరివని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జోస్యం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది.. ఇప్పటికైనా ఆయన మారాలని సూచించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ …
Read More »