ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. తాజాగా 103 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉంది.మొత్తం కేసులు – 20,77,608 .వీటిలో కోలుకున్న వారి సంఖ్య 20,61,832. మరణించిన వారి సంఖ్య – 14,498గా ఉంది.
Read More »ఏపీలో మందుబాబులకు Good News
ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.
Read More »ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో …
Read More »వంగవీటి రాధాకు 2+2 భద్రత
ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కి అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
Read More »ఏపీలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు
ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను …
Read More »మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా
ఏపీలో వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గుంటూరు జిల్లా గురజాల మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 16 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది.. 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో 20 వార్డులకు 15 వార్డుల్లో వైసీపీ 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కర్నూలు …
Read More »ఏపీ సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుందా..?..2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమేనా..?
ఇది చదవడానికి కాస్త విడ్డూరంగా ఉన్న కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను.. ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అవుననే చెప్పాలి. ఇటీవల ఒక ప్రముఖ జాతీయ మీడియా చెపట్టిన సర్వేలో టాప్ టెన్ లో కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్థానం లభించకపోవడం కూడా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇమేజ్ మసకబారుతుందని చెప్పొచ్చు.. గత సార్వత్రిక ఎన్నికలకు …
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు పలు అంశాలపై సీఎం చర్చించే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీల నిధుల మంజూరు విషయాలపైనా కేంద్రమంత్రులతో ఆయన మాట్లాడనున్నారు. అటు ప్రధాన మంత్రితో భేటీకి సీఎం కార్యాలయం సంప్రదించినట్లు తెలుస్తోంది.
Read More »