Home / Tag Archives: ysrcp (page 70)

Tag Archives: ysrcp

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.

Read More »

ఏపీలో హైవేల కోసం రూ.4,459కోట్లు

ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది. పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది. కాగా, ఎన్‌హెచ్‌ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు …

Read More »

దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ-ఏపీ

కరోనా లాక్ డౌన్, ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 2020 జూన్ నాటికి దేశంలో 55.41% ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లుండగా.. సెప్టెంబర్ కు అది 57.29%గా ఉంది. ఇక వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా చూస్తే మహారాష్ట్ర తొలి స్థానంలో, ఏపీ-తెలంగాణ  సర్కిల్ 2వ స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69% మందికి …

Read More »

ఏపీ సీఎం జగన్ ప్రధాని కావాలి-డిప్యూటీ సీఎం నారాయణ

ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  పై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,బీజేపీ,జనసేన,కమ్యూనిస్టులు  ఒక్క మాట మాట్లాడినా. వైసీపీ నేతలు మూకుమ్మడిగా స్పందిస్తారు. అలాగే సీఎం జగన్ ను కూడా ప్రశంసిస్తుంటారు. కుప్పంలో  వైసీపీకి చెందిన  మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ‘ ప్రజలకు ఇంత మేలు చేస్తున్న జగన్ ఒకసారి ప్రధాని కావాలి. ఇందుకోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నా, కుప్పం ప్రజలకు …

Read More »

అధికార వైసీపీకి షాక్

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నియంతృత్వ పోకడలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి మామయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలిపారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేయకపోతే పెన్షన్లు ఇళ్లు వంటి పథకాలు వర్తించవని వాలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారు. ఇది సరైన విధానం కాదు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోంది’ అని ఆయన …

Read More »

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.

Read More »

సొంత ఇలాఖాలో చంద్రబాబుకి షాక్

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పనితీరును మెచ్చే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారని, ఈ ఫలితాలు చంద్రబాబు, లోకేశ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రగిరిని వదిలి కుప్పం చేరుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, …

Read More »

ఏపీలో కొత్తగా 51కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. ఇందులో 609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా… మొత్తం 7,165 మరణాలు సంభవించాయి..

Read More »

గురువారం తిరుపతికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

Read More »

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్‌ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat