ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …
Read More »అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి …
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడి -చంద్రబాబు స్పందన
ఏపీలోనిఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్‌నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కూల్చివేతను టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీలో ఉన్న బలమైన బీసీ …
Read More »జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లకు ఈడీ షాకిచ్చింది. ఈరోజు శుక్రవారం ఉదయం నాలుగంటల నుండి ఇంట్లో ఈడీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంటి లోపలికి రానీయకుండా …
Read More »ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. తమ భూములను అక్రమంగా లాక్కున్నారని కొందరు మహిళలు ఎమ్మెల్యే కండువాను లాగేశారు. ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఐదెకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా. మహిళలు ఆరోపిస్తున్నారు.
Read More »ఏపీలో అధికార వైసీపీలో పదవుల జాతర
ఏపీ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న రెండు విప్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకోసం పనిచేసే ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా.. విప్ ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా విప్ ల కోసం అర్హులైన కొఠారు అబ్బయ్య చౌదరి, …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి స్వయాన బాబాయి.. అప్పటి ఉమ్మడి ఏపీమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. …
Read More »AP BJP అధ్యక్షుడు సోము వీర్రాజుకు షాకిచ్చిన పోలీసులు
ఏపీలోని కోనసీమ జిల్లాలో ఇటీవల చెలరేగిన అల్లర్లలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద రహదారిపై వాహనం కదలకుండా మరో వాహనాన్ని పోలీసులు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందర శ్రీలక్ష్మి మాతృమూర్తి చనిపోవడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు …
Read More »CM Jagan కు షాకిచ్చిన YSRCP MLA
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం …
Read More »