ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.
Read More »ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా పని చేశారు.
Read More »నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్
ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …
Read More »తనపై వస్తోన్న వార్తలపై మంత్రి అవంతి శ్రీనివాస్ క్లారిటీ
ఏపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు. …
Read More »TTD పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకు ముందు సుబ్బారెడ్డి 2019లో తొలిసారిగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఈ ఏడాది జూన్‌లో పదవీకాలం ముగిసింది. ఈ సారి వేరే వారికి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డికే …
Read More »TTD చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. టీటీడీ చైర్మన్ గా ఆయన్ను కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, టీటీడీ ఛైర్మన్ గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని గతంలో సుబ్బారెడ్డి తెలిపారు.
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015 సవరించిన పేస్కేలు ప్రకారం మినిమం టైం స్కేలు వర్తింపజేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు(ఇద్దరు పిల్లలకు) ఇస్తామంది. కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తూ/కరోనాతో చనిపోతే కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణానికి ౯ 2 లక్షలు ఇస్తారు.
Read More »ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 అధ్యాపక, వర్సిటీల్లో 25 వేల సహాయ ఆచార్యుల, 157 బ్యాక్ గ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బ్యాక్ గ్ ఖాళీల్లో 92 SC, 65 ST కేటగిరికి చెందినవి అని.. వీటికి జూలైలో నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే ఏడాది జనవరిలో డిగ్రీ అధ్యాపకుల నియామకాలకు, ఫిబ్రవరిలో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ …
Read More »పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …
Read More »