Home / Tag Archives: ysrcp governament (page 13)

Tag Archives: ysrcp governament

రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు  సోమవారం దేశ రాజధాని మహానగరం  ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్‎మెంట్ తీసుకున్నట్లు  సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …

Read More »

AP లో 82కొత్త కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166

Read More »

ఏపీలో ఒమిక్రాన్ కలవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.

Read More »

అందులో ఏపీ ముందు

ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో  తెలంగాణ   7వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి …

Read More »

సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh

ఏ మాత్రం తనకు సబ్జెక్ట్‌ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …

Read More »

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్‌

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శుక్రవారం ఎన్జీటీ తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టరాదని ఎన్జీటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కారం చర్యలు అవసరం లేదని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే …

Read More »

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More »

గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ

ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.

Read More »

వైసీపీకి బాబు సవాల్

ఏపీ  ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …

Read More »

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కి మళ్లీ అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat