ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ప్రాణహాని
ఏపీ ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత..దెందులూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రభాకర్.. ‘నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది. ఓ షూటర్ నాకు ఫోన్ చేసి.. నన్ను చంపేందుకు పురమాయించారని చెప్పాడు. సొంతంగా గన్మెను పెట్టుకుని పోషించలేను. ఉచితంగా రక్షణ కల్పించండి’ అని కోరారు.
Read More »టీటీడీ సంచలన నిర్ణయం
ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో …
Read More »YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …
Read More »అంచెలంచెలుగా ఎదిగిన మల్లాది సందీప్ – వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియామకం
మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్‌ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ …
Read More »ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ మెడికల్ అగ్రీకల్చరల్ ప్రవేశాలకు సంవంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసిన ఆయన.. జూలై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తు తేదీలు, ఫీజు వంటి వివరాలు ఉంటాయన్నారు. ఆగస్టులో ఫలితాలు విడుదల …
Read More »ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేనో తారీఖున వైఎస్సార్సీఎల్పీ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
Read More »ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో …
Read More »వంగవీటి రాధాకు 2+2 భద్రత
ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …
Read More »నేడే ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు జమా
కరోనా కాలంలో గంగపుత్రులను ఆదుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ YSR మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా ఈ పథకానికి రూ.119.88 కోట్లను విడుదల చేస్తూ జగన్ సర్కార్ సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చేపల వేటను నిషేధించిన టైంలో జీవనోపాధి కోల్పోయిన ఒక్కో ఫ్యామిలీకి.. ఈ స్కీమ్ ద్వారా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
Read More »