ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ …
Read More »వైసీపీకి చుక్కలు చూపిస్తాం -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దొంగ హామీలు ఇచ్చారు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి …
Read More »రెండోరోజు సభ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి నిన్న శుక్రవారం వెళ్లిన సంగతి తెల్సిందే. అయితే నిన్నటి నుండి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై చర్చకు పట్టుబడింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. వరుసగా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బందిగా మారిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ …
Read More »రూ.2,28,540 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
ఏపీ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లుగా కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రెవెన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు. రాష్ట్ర వృద్ధి రేటు 11.43శాతమని, స్థూలవృద్ధిలో రాష్ట్రం …
Read More »అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులు సస్పెండ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన శాసనసభ్యులు అడ్డుతగులుతున్నారు. తాను బడ్జెట్ ప్రవేశపెడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగులుతుండటంతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ టీడీపీ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, ఏలూరి సాంబశివరావు, బాలకృష్ణ, అశోక్ తదితర టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం .. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి జగన్ రేపు శుక్రవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
Read More »ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘనవిజయం
ఏపీ లో ఈరోజు గురువారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ తరపున నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అయిన నర్తు రామారావు కు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట …
Read More »సభ నుండి టీడీపీ వాకౌట్
ఈ రోజు మంగళవారం నుండి ప్రారంభమమైన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి టీడీపీకి చెందిన శాసనసభ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సత్యాలు భరించలేక పోతున్నామంటూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
Read More »జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. నేటి …
Read More »సీబీఐ ముందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు …
Read More »