వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ
Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …
Read More »సీఎం కేసీఆర్‌పై షర్మిల్ సెటైరికల్ ట్వీట్
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ ట్వీట్ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్ బరస్ట్’పై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …
Read More »వైఎస్సార్ ఫ్యామిలీ.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు. ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో …
Read More »పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్న YS Sharmila
ప్రజాప్రస్థానం పేరిట YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 11న పునఃప్రారంభం కానుంది. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టాలనుకున్నారు.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నల్లగొండ జిల్లాలోని కొండపాకగూడెం వద్ద పాదయాత్రకు బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు మళ్లీ అక్కడ నుంచే ప్రారంభించనున్నారు.
Read More »CM KCR పై YS Sharmila Fire
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించే ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సెటైరికల్ కామెంట్లు చేసింది . ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒకే తానులో ముక్కలని ఆమె విమర్శించారు. రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేమీ లేదు..సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదీ లేదన్నారు. ఏడాదికి 2 కోట్ల …
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్
తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో …
Read More »వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా కలర్ తెలుసా..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ..నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో …
Read More »షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా అందజేత
వైఎస్ షర్మిల సిరిసిల్లకు చేరుకున్నారు. డాక్టర్ పెంచలయ్య ఇంట్లో షర్మిల అల్పాహారం తీసుకున్నారు. షర్మిలకు వైఎస్ బొమ్మలతో కూడిన పట్టు శాలువా, అగ్గిపెట్టెలో పెట్టె శాలువా బహుకరించారు. మరికాసేపట్లో కరోనా బాధిత కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను షర్మిల పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.
Read More »షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్
తెలంగాణలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్ షర్మిల పర్యటించారు. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హుజూర్‌నగర్‌లో పర్యటించారు. అయితే షర్మిల హుజూర్ నగర్ పర్యటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మేడారం గ్రామంలో ఇంటికి తాళం వేసి నీలకంఠ సాయి కుటుంబం బయటకు వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని.. కావాలనే నీలకంఠ కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు తరలించారని వైఎస్సార్‌టీపీ నేత పిట్టా రాం రెడ్డి ఆరోపించారు. తాళం వేసిన నీలకంఠ …
Read More »