Home / Tag Archives: ys jaganreddy (page 4)

Tag Archives: ys jaganreddy

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …

Read More »

ఏపీకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికాయం

ఏపీ అధికార వైసీపీకి చెందిన దివంగత నేత, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో మంత్రి పార్థివదేహాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక చాపర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికదేహాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. చాపర్‌లో మంత్రి భౌతికకాయం వెంట తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి వెళ్ళనున్నారు. ఇప్పటికే మేకపాటి కుటుంబసభ్యులు, …

Read More »

మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి చనిపోయే ముందు ఏమి జరిగిందంటే..?

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఇంటి వాచ్‌మెన్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడు. ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధ‌మ‌య్యాడు. అంత‌లోనే గుండెలో నొప్పి వ‌స్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌ను, గ‌న్‌మెన్ల‌ను అప్ర‌మ‌త్తం చేశాం. వారు ఛాతీపై బ‌లంగా ఒత్తిన‌ప్ప‌టికీ ఆయ‌న‌లో చ‌ల‌నం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వాచ్‌మెన్ చెప్పాడు.గౌత‌మ్ రెడ్డిని ఉద‌యం 7:45 గంట‌ల‌కు ఆస్ప‌త్రికి …

Read More »

2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?

దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో  ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …

Read More »

ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం

ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట

ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.

Read More »

ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ క్లారిటీ

ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.

Read More »

సీఎం జగన్ కు RGV ఉచిత సలహా ..జగన్ పాటిస్తాడా..?

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా …

Read More »

ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు

ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,339 కరోనా టెస్టులు చేయగా 547 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20,78,923కు చేరగా ఇప్పటివరకు 14,500 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read More »

ఏపీలో కొత్తగా 4,07,36,279 ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 1 వరకు నమోదైన ఓట్లతో జాబితాను రూపొందించినట్లు తెలిపింది. కొత్త ఓటర్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2,01,34,664 కాగా మహిళా ఓటర్లు 2,05,97,544. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4,071 మంది ఉన్నట్లు తెలిపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat