ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More »ఏపీలో మంకీ పాక్స్ కలవరం
ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ Update – 24.92శాతం పోలింగ్
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …
Read More »అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి …
Read More »మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై దాడి -చంద్రబాబు స్పందన
ఏపీలోనిఅనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్‌నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కూల్చివేతను టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీలో ఉన్న బలమైన బీసీ …
Read More »వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
ఏపీ అధికార పార్టీ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి విధితమే. అయితే అనంత్ బాబుకు చెందిన బెయిల్ పిటిషన్ ను రాజమహేంద్రవరం SC, ST కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ మంజూరుకు నిందితుడు అనంతబాబు తరపున న్యాయవాది సరైన కారణాలు చూపకపోవడంతో పిటిషన్ రద్దు …
Read More »జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లకు ఈడీ షాకిచ్చింది. ఈరోజు శుక్రవారం ఉదయం నాలుగంటల నుండి ఇంట్లో ఈడీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంటి లోపలికి రానీయకుండా …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »బీజేపీ-జనసేన సీఎం అభ్యర్థిగా పవన్
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »