ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Read More »మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం
ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
Read More »మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో YSRCP హవా
ఏపీలో వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గుంటూరు జిల్లా గురజాల మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 16 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది.. 3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో 20 వార్డులకు 15 వార్డుల్లో వైసీపీ 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కర్నూలు …
Read More »బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో YSRCP ఘనవిజయం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలు చోట్ల టీడీపీకి.. ఇంకొన్ని చోట్ల వైసీపీకి గట్టిగానే షాకులు తగులుతున్నాయి. అయితే.. మంత్రుల స్వగ్రామంలో.. నివాసముండే ప్రాంతాల్లో కూడా టీడీపీ జెండా ఎగిరిందంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాలు ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. …
Read More »పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read More »Ap Govt సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు -కేబినెట్ మంత్రి హోదాలో నియమిస్తూ ఉత్తర్వులు
రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.ఈ …
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి రాధాకృష్ణ , కొడాలి నాని పై పోటీ చేస్తారని ఊదరకోట్టిన సోషల్ మీడియా .వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారా…కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ గుడివాడ లో ప్రత్యేక సమావేశం….రాజకీయ భవిష్యత్తు పై చర్చించిన కొడాలి నాని, వంగవీటి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి మీత్రుడు వంగవీటి రాధాకృష్ణ ను వైసీపి పార్టీ లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మంత్రి కొడాలి నాని చేస్తారా..ఈరోజు జరిగిన కొడాలి ,వంగవీటి …
Read More »టీటీడీ అన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది. కాగా, …
Read More »అయ్యన్నపాత్రుడుపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం జగన్ పై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘అయ్యన్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను.. చంద్రబాబు సీఎం పదవిని పీకేశాం. ఇంకా ఏం పీకాలి’ అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరమన్న రోజా.. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.
Read More »