ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి నిత్యం ఏదోక వార్తతో వివాదాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయనను తప్పు దారి పట్టిస్తున్నారని వర్మ అన్నాడు. ఇకనైనా …
Read More »ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు
ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 33,339 కరోనా టెస్టులు చేయగా 547 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 20,78,923కు చేరగా ఇప్పటివరకు 14,500 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Read More »ఏపీలో కొత్తగా 4,07,36,279 ఓటర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 1 వరకు నమోదైన ఓట్లతో జాబితాను రూపొందించినట్లు తెలిపింది. కొత్త ఓటర్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,07,36,279 ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2,01,34,664 కాగా మహిళా ఓటర్లు 2,05,97,544. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4,071 మంది ఉన్నట్లు తెలిపింది.
Read More »ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపుపై నాగ్ సంచలన వ్యాఖ్యలు
బంగార్రాజు ప్రమోషన్ మీట్లో సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున సినిమా టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తొలిసారి స్పందించాడు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తమ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించాడు. రేట్లు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. తమ సినిమా వసూళ్లు కొంచెం తగ్గినా పరవాలేదన్నాడు. రేట్లు పెంచలేదని ‘బంగార్రాజు’ను జేబులో పెట్టుకుని కూర్చోలేం కదా అని తెలిపాడు. …
Read More »ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్లున్న 5 లక్షల మందికి వ్యాక్సిన్లు
ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా పంపిణీ నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు 5 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మందికి వ్యాక్సిన్లు వేశారు.. తూ.గో, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి టీకా వేశారు. 28 రోజుల అనంతరం వీరికి రెండో డోసు టీకా వేయనుండగా.. దేశ వ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల …
Read More »ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. తాజాగా 103 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉంది.మొత్తం కేసులు – 20,77,608 .వీటిలో కోలుకున్న వారి సంఖ్య 20,61,832. మరణించిన వారి సంఖ్య – 14,498గా ఉంది.
Read More »YSRCP ప్రభుత్వానికి జనసేన సవాల్
ఏపీలో పలు కారణాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైసీపీ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువిస్తున్నట్లు జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ లోపు ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయకుంటే.. సంక్రాంతి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతారని చెప్పారు. గుంటూరులో జరిగే ధర్నాలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. పల్నాడు ప్రాంతంలో 4లక్షల ఎకరాల్లో మిర్చి వేసిన రైతులు ఎకరాకు రూ.70 …
Read More »ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.
Read More »ఏపీలో మందుబాబులకు Good News
ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »ఏపీ ప్రభుత్వం తీపికబురు
ఏపీ అర్హులుగా ఉండి సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. అలాంటి 18.48లక్షల మంది అకౌంట్లలో పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు పేర్కొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్లో …
Read More »