ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్‌వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కి మళ్లీ అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆయన కరోనా బారి న పడి ఈ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.
Read More »బాబుకు ముద్రగడ ఘాటు లేఖ
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …
Read More »జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం
ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Read More »YSRCP నేతలకు రోహిత్ Warning
స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం …
Read More »బాబుకు సూపర్ స్టార్ ఫోన్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై …
Read More »TDP శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపు..?
ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీకి చెందిన అభిమానులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కు జరిగిన అవమానం పట్ల సంయమనంతో వ్యవహరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఈ ప్రకటన చేసినట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినవారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని తెలిపారు.
Read More »ఏపీ అధికార వైసీపీలో విషాదం
ఏపీ అధికార వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆ మహ్మద్ కరీమున్నీసా(65) గుండెపోటుతో చనిపోయారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురికాగా.. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆమె హాజరయ్యారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేసిన ఆమెకు ఈ ఏడాది మార్చిలో సీఎం జగన్ ఎమ్మెల్సీగా …
Read More »Ap నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7390 కాగా, కొత్తగా సృష్టించినవి 3475 ఉన్నాయి. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 4142 పోస్టులు, APVVP పరిధిలో 2520 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 4203 పోస్టులు ఉండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయనున్నారు.
Read More »