టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుగా నియమితుడైన రమణ దీక్షితులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వంశ పారంపర్య అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయంపై అర్చకుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయని, ఆయనకు అర్చకులంతా రుణపడి ఉంటారని తెలిపారు. తనకు శ్రీవారి ఆగమ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, శ్రీవారికి …
Read More »దటీజ్ జగన్…లక్ష్మీపార్వతికి కీలక పదవి
దివంగత నేత నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీపార్వతి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె చంద్రబాబు మీద విమర్శల దాడి చేసేవారు. లక్ష్మీపార్వతి గతంలో సొంత పార్టీ పెట్టారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో …
Read More »ఏపీలో పంచాయతీలకు ఎన్నికలు..రిజర్వేషన్లు అమలు
ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. అప్పుడే మళ్ళీ ఎన్నికల నగరా మోగింది.అన్ని పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో మూడు నెలల్లో జరిపే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తన సమాధానం తెలిపింది. …
Read More »సీఎం జగన్ సీరియస్..!
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అందజేసే అవార్డులకు …
Read More »ఏపీలో అమ్మఒడి పథకం అర్హతలు ఇవే..!
నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 79ను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లులకు ఈ …
Read More »ఏపీలో పోలీసు కొలువుల జాతర
ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …
Read More »వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆద్వర్యంలోని ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందని సమచారం. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడానికి గాను ‘నాడు-నేడు’తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ‘మిషన్’ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ‘మిషన్ బిల్డ్’పేరుతో దీనిని ఏర్పాటు చేసి, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను విక్రయించాలని నిర్ణయించింది. ‘ఆపరేషన్ బిల్డ్’ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్’ (ఎన్‌బీసీసీ)తో …
Read More »ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …
Read More »ఆ జిల్లా కలెక్టర్ ను అభినందించిన ..సీఎం జగన్
అనంతపురం జిల్లా కలెక్టర్ ఎన్ సత్యనారాయణను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసిచారని వార్త వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా స్కీమ్ ను చక్కగా అమలు చేసి, రైతులందరికి డబ్బులు అందేలా చేశారని ఆయన మెచ్చుకున్నారు .రైతు భరోసాపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 4,81,498 రైతు కుటుంబాలకు భరోసా కింద రూ.390 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. వ్యవసాయశాఖ, రెవెన్యూ, బ్యాంకర్ల సహకారంతో భరోసా సమర్థవంతంగా అమలు …
Read More »ఏపీలో రైతులకు మరో విడత రైతు భరోసా..!
ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా …
Read More »