ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించిన SEC.. ఈ నెల వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్న SEC ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి సూచించింది.
Read More »ఏపీలో మరో ఓటుకు నోటు తరహా-నామినేషన్ వేస్తే 2లక్షలు ఆఫర్..?
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »సీఎం జగన్ కు మాజీ మంత్రి యనమల వార్నింగ్
ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు అధికారులను సహకరించకుండా చేస్తూ వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు గుర్తించాలని సూచించారు. నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొనమని చెప్పటం సరికాదని మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ అంశంపై పునరాలోచన చేయాలన్నారు
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని, రెండో శనివారాలు కూడా సెలవులు ఉండవని పేర్కొంది. కరోనాతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనవరి 18 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం అవుతున్నాయి..
Read More »‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం …
Read More »