ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 1956 నుంచే తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్ హయంలో పోతిరెడ్డిపాడు నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దోపిడీ చేశారని, అప్పట్లోనే తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు జగన్ కూడా కృష్ణ జలాలను దోచుకుపోవాలనే దుర్భుద్ధితో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నల్లగొండలోని …
Read More »పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్ వే తో నిర్మిస్తున్న బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్ (పిఐపి) తొలి ఫలితం అందుతోంది. గోదావరి డెల్టాకు మొదటిసారిగా పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే ప్ర్రక్రియ నేడు (శుక్రవారం 11.06.2021) ప్రారంభించడం ద్వారా తొలి ఫలితం అందించేందుకు అంకురార్పణ చేసింది మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని …
Read More »ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్‍పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు .
ఏపీ సీఐడి ఏజీడీ సునీల్‍కుమార్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‍ఐ జోషి . ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది క్రిస్టియన్‍గా మతం మార్చుకున్న సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తప్పించాలి . మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‍ను వదులుకోవాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‍కుమార్‍ను సర్వీస్ నుంచి తొలగించాలని వినతి . సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో …
Read More »That Is వైఎస్ జగన్
ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇచ్చిన హామీలతో పాటుగా మేనిఫెస్టోలో లేకున్నా అమలు చేస్తున్న వాటిల్లో కొన్ని.. ► రైతు భరోసా డబ్బులను ఎనిమిది నెలలు ముందుగానే అది కూడా చెప్పిన దాని కన్నా మిన్నగా ముఖ్యమంత్రి జగన్ అందచేశారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 బదులుగా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అదనంగా అందుతోంది. నాలుగేళ్లలో 50 వేల రూపాయలకు …
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »AP 2021-22 వార్షిక బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, …
Read More »ఏపీ,తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం ఇదే..?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి డబుల్ మ్యుటెంట్ వైరసే కారణమని CCMB సైంటిస్టులు చెబుతున్నారు. మార్చి మధ్యలో సెకండ్ వేవ్ మొదలు కాగా.. క్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొత్తగా వస్తున్న కేసుల్లో సగానికి పైగా బి. 1.617 వైరస్ (డబుల్ మ్యుటెంట్) రకమే ఉందన్నారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న ఎన్440కే రకం వైరస్ క్రమంగా తగ్గుతుందన్నారు.
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ఆప్డేట్ – వైసీపీకి తిరుగులేదు
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన వైసీపీ తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలోనే కొనసాగుతున్నది. ప్రతి రౌండ్‌లో మెజారిటీ సాధిస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 1,24,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 2,50,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 23,223 ఓట్లు పోలయ్యాయి.వైసీపీ అభ్యర్థి గురుమూర్తి …
Read More »వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
Read More »