ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న DDRP (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్‌వాల్, కోతకు గురైన జెట్ గ్రౌటింగ్ డిజైన్లను ఆమోదించుకోవాలని సూచించారు. డిజైన్లు ఆమోదం పొందిన వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు.
Read More »ఏపీలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు
ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్‌గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను …
Read More »బాబుకు ముద్రగడ ఘాటు లేఖ
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘మీరు ఏడవడం చూసి ఆశ్చర్యపోయా. మీ కంటే మా కుటుంబానికి చాలా చరిత్ర ఉంది. కాపు ఉద్యమ టైంలో దీక్ష చేపట్టిన నన్ను, నా కుటుంబసభ్యులను పోలీసులతో బూతులు తిట్టించారు. మరి మీ శ్రీమతి గారు దేవతా? మీరు చేసిన హింసకు నిద్రలేని రాత్రులు గడిపాం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. …
Read More »జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయం
ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Read More »బాబుకు సూపర్ స్టార్ ఫోన్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై …
Read More »బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం
ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది. మొత్తమ్మీద నోటా, బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో వైసీపీ మెజార్టీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగానే ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,550 …
Read More »పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్
ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్టాభిరామ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం రాత్రి విజయవాడ పోలీసులు పట్టాభిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »TTD-సెప్టెంబర్ 25 నుండి Online సర్వ దర్శనం టోకెన్లు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో …
Read More »