బెయిల్ కోసం వైసీపీ రెబల్ MP రఘు రామకృష్ణం రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ CID తనపై నమోదు చేసిన కేసులో.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు MP రఘురామరాజుకు గుంటూరులోని సీఐడీ కోర్టు.. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఆయన కాళ్లపై గాయాలు ఉండటంతో జైలుకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »సీఎం జగన్ సరికొత్త బాధ్యతలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.
Read More »