ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ.. చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆవేశంతో నిప్పులు చెరిగారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. నేను స్కార్పియోలు కొంటే ఎవరిచ్చారని అడిగారు. …
Read More »రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More »ఏపీలో మంకీ పాక్స్ కలవరం
ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …
Read More »సీఎం జగన్ కి అందరూ ఫిదా.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని YSR జిల్లా కడపలో సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. తన కాన్వాయ్ వెళ్తుండగా.. మధ్యలో అంబులెన్స్ రావడంతో కాన్వాయ్ ఆపి, దారివ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తుండగా.. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన …
Read More »ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …
Read More »సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి రాధాకృష్ణ , కొడాలి నాని పై పోటీ చేస్తారని ఊదరకోట్టిన సోషల్ మీడియా .వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారా…కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ గుడివాడ లో ప్రత్యేక సమావేశం….రాజకీయ భవిష్యత్తు పై చర్చించిన కొడాలి నాని, వంగవీటి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి మీత్రుడు వంగవీటి రాధాకృష్ణ ను వైసీపి పార్టీ లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మంత్రి కొడాలి నాని చేస్తారా..ఈరోజు జరిగిన కొడాలి ,వంగవీటి …
Read More »Cm జగన్ కు ముద్రగడ లేఖ
ఏపీ అధికార వైసీపీ అధినేత,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ‘సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించాలన్న నిర్ణయం మంచిది. మాజీ ఎగ్జిబిటర్ నావి కొన్ని సూచనలు. నటీనటులు, టెక్నికల్ సిబ్బంది, కార్వాన్లు, హాస్టళ్లు, భోజనం తదితర వాటికి సంబంధించిన ఖర్చుని నిర్మాత నుంచి తీసుకుని.. ప్రభుత్వం దాన్ని వారికి నేరుగా ఇవ్వాలి. అప్పుడు బ్లాక్ మనీ అనే మాట ఉండదు. అనవసర …
Read More »టీటీడీ పాలక మండలి జాబితా విడుదల
టీటీడీ కొత్త పాలకమండలిని ఏపీ ప్రభుత్వం నియమించింది. 25 మందితో టీటీడీ పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. ఈ పాలకమండలిలో ఏపీ నుంచి నలుగురు తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలిలో పారిశ్రామిక వేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో పార్దసారధి రెడ్డి, మురంశెట్టి రాములు, …
Read More »ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక మహిళా పోలీసు..
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇక నుంచి మహిళా పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. ఇన్నాళ్లూ ఈ కార్యాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి గా ఉన్న వారి పేరు మారిపోతోంది. వారిని మహిళా పోలీసు గా మారుస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా పని చేస్తున్న వారిని మహిళా పోలీసుగా ఆ నోటిఫికేషన్ లో నిర్థారించారు. మహిళా …
Read More »