నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ క్రతువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ …
Read More »నేత్రపర్వంగా మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం
తెలంగాణ రాష్ట్రంలో శ్రీలక్ష్మీ నరసింహా స్వామి కొలువై ఉన్న యాదాద్రిలో ఈరోజు సోమవారం మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఇందులో భాగంగా దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. …
Read More »కాళేశ్వరం ముక్తిమర్గం ..యాదాద్రి భక్తిమార్గం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ …
Read More »CM KCR పై బండి సంజయ్ ఫైర్
జనగామ సభలో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘కేసీఆర్ చెల్లని రూపాయి. బహిరంగ సభలో బీజేపీపై విమర్శలు కాదు టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో.. ఏం పీకారో చెప్పాలి. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఓడిపోతాననే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు’ అని బండి ఫైర్ అయ్యారు.
Read More »యాదాద్రిలో సీఎం కేసీఆర్
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. యాగస్థలం, మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మార్చి 28న సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం ఆలయ నిర్మాణ పురోగతి గురించి కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
Read More »ప్రత్యేక ఆకర్షణగా టెంపుల్ సిటీ
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు పచ్చదనానికి నిలయంగా మారుతున్నది. ఆలయ పరిసరాల్లో 98 రకాలకు చెందిన 4.21 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకునేలా రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై వైటీడీఏ దృష్టిసారించింది. వాహనాల రద్దీ కారణంగా కాలుష్య సమస్యలు తలెత్తకుండా రకరకాల మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే …
Read More »యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం …
Read More »వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న సీఎం గ్రామ సందర్శనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పారు. గ్రామ సభ …
Read More »ఈ నెల 22న వాసాలమర్రికి సీఎం కేసీఆర్
ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నెలలో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించిన సంగతి తెలిసిందే.
Read More »యాదాద్రిని దర్శించుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
దేశం అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్న జస్టీస్ శ్రీ ఎన్.వి రమణకు యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.అనంతరం …
Read More »