వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచలనాలకు తెరపడింది. బుధవారం 64-69 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సూర్మనెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్లలోనూ టర్కీ బాక్సర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో ఐదుగురు జడ్జీలు ఏకగ్రీవంగా ఆమెనే విజేతగా తేల్చారు. ఈ ఓటమితో లవ్లీనా బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వచ్చిన …
Read More »