టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లికి బీసీసీఐ చెప్పాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘కోహ్లిలా సెలెక్టర్లు క్రికెట్ ఆడకపోవచ్చు. కానీ కెప్టెన్ను నిర్ణయించే హక్కు వారికుంటుంది. తమ నిర్ణయం గురించి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. ఇది కోహ్లికే కాదు ప్రతి ఆటగాడికి వర్తిస్తుంది. ఈ వివాదం కోహ్లి టెస్ట్ కెప్టెన్సీపై ప్రభావం చూపదని ఆశిస్తున్నా’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించాడు.
Read More »Virat Kohli అభిమానులకు షాకింగ్ న్యూస్
సౌతాఫ్రికా టూర్లో టీమిండియా ఆడనున్న 3 వన్డేల సిరీస్ కి విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ సిరీస్క అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన కోహ్లి.. వన్డేల్లో ఆడనని బీసీసీఐకి తేల్చి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు సౌతాఫ్రికా బయల్దేరడానికి ఇప్పటికే భారత జట్టు ముంబైలోని హోటల్లో ఉండగా.. కోహ్లి ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్సీ విషయం టీంలో కోల్డ్ వార్కు దారి తీసిందనే చెప్పాలి.
Read More »ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్
ఈ యుగంలో విరాట్ కోహ్లి అత్యుత్తమ బ్యాటర్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లికి బౌలింగ్ చేయడం తనకు ఎప్పుడూ కష్టంగా అనిపించలేదని పేర్కొన్నాడు. ఆ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మితికి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేదని అమీర్ అన్నాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిని అమీర్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »ఆటగాళ్లు యంత్రాలు కాదు
టీమిండియా FullTime కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు తొలిసారి మైదానంలోకి దిగనున్నాడు. ఈరోజు రాత్రి 7గంటలకు న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ సిరీస్ నుంచి కొంతమంది సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంపై రోహిత్ మాట్లాడాడు. ‘వర్క్లోడ్ మేనేజ్ చేయడం ముఖ్యం. మన ఆటగాళ్లు యంత్రాలు కాదు. రోజూ స్టేడియాలకు తిరగలేరు. వారికి కొంత సమయం కావాలి. ఫ్రెష్నస్ అవసరం’ అని రోహిత్ అన్నాడు.
Read More »T20 WorldCup-ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొదటిసారి టీ20ని కైవసం చేసుకున్ననది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది. టీ20 వరల్డ్‌కప్ మొత్తం ప్రైజ్‌మనీ 42 కోట్లు కాగా, 16 జట్లకు ఆ …
Read More »Team India వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ..?
టీమిండియా వన్డే కెప్టెన్ కోహ్లి భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్ పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట. ఈ మేరకు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. కోహ్లి ఇప్పటికే 3 టీ 20 కెప్టెన్ తప్పుకున్నాడు.
Read More »హార్దిక్ పాండ్యాపై వేటు తప్పదా..?
టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో బీసీసీఐ చర్యలకు సిద్ధమైంది. త్వరలో జరిగే న్యూజిలాండ్ టూర్క టీమ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఫిటెనెస్ లేక ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్యాను ఈ టూర్కు ఎంపిక చేయకుండా పక్కనబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్కప్లో అతడి ఫిట్నెస్పై నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. హార్దిక్ గాయపడ్డా జట్టులోకి ఎందుకు తీసుకున్నారో జట్టు నుంచి బీసీసీఐ వివరణ కోరనుంది.
Read More »రవిశాస్త్రి BCCI కి ప్రత్యేక ధన్యవాదాలు
టీమిండియా కోచ్ జట్టు విజయాల కోసం చేయాల్సినదంతా చేశానని రవిశాస్త్రి తెలిపాడు. భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశం కల్పించిన బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2014లో ఇంగ్లాండ్ టూర్లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయంతో విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో తనను శ్రీనివాసన్ కోచ్ గా నియమించారన్నాడు.
Read More »టీమిండియా ఘన విజయం
టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో.. బోణీ చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్ అర్ధ శతకాలతో.. గ్రూప్-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత …
Read More »వన్డే, టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్
టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.ఇక టీమిండియా సెమీస్‌కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్‌గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి. ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి …
Read More »