ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. 7 వికెట్ల తేడాతో విరాట్ సేన ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (56), విరాట్ (73*) రాణించడంతో 17.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 164/6 రన్స్ చేసింది. ఓపెనర్ రాయ్ (46), మోర్గాన్ (28), స్టోక్స్ (24), మలన్ (24) పరుగులు చేశారు. …
Read More »రికార్డుల రారాజు విరాట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రికార్డులు దాసోహమవుతున్నాయి. తాజాగా టీ20 ఫార్మాట్ లో 3000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (26) చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత రోహిత్ (25), డేవిడ్ వార్నర్ (19), గప్తిల్ (19) ఉన్నారు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా యావరేజ్ కల్గిన ఏకైక ప్లేయర్ కూడా కోహ్లినే.
Read More »రోహిత్ శర్మ ఆడకపోవడం వెనక అసలు కారణం ఇదే..?
ఇంగ్లండ్తో జరిగిన తొలి T20లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడకపోవడంపై పెద్ద చర్చ జరిగింది ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్‌ను ఎందుకు తప్పించారని విమర్శలు వచ్చాయి. రొటేషన్ పద్ధతిలో భాగంగానే అతడికి విశ్రాంతినిచ్చారని తెలిసింది. ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలనే ఈ విధానాన్ని అమలు చేస్తోందట. ఈ ఏడాది ICC T20 వరల్డ్ కప్ భారత్ లో జరగనుంది.
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …
Read More »30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది
Read More »ధోనీ రికార్డును విరాట్ బద్దలు కొడతాడా..?
టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు అత్యధికంగా 60 టెస్టులకు కెప్టెన్ గా ఉండగా నాలుగో టెస్టుతో విరాట్ దీన్ని సమం చేస్తాడు. మరో 17 రన్స్ చేస్తే కెప్టెన్ గా 12వేల రన్స్ చేసిన ఘనత పొందుతాడు. ఇతడి కంటే ముందు పాంటింగ్, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. ఈ టెస్టులో సెంచరీ చేస్తే అన్ని ఫార్మాట్లలో కలిపి అధిక సెంచరీలు చేసిన పాంటింగ్ (41)ని …
Read More »టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్
ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …
Read More »ధోనీ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాయకుడిగా ఘనత సాధించాడు. ధోనీ స్వదేశంలో 30 టెస్టులకు సారథ్యం వహించి 21 మ్యాచులు గెలిపించగా, కోహ్లి 29 మ్యాచుల్లో 22 మ్యాచులను గెలిపించాడు అజాహరుద్దీన్ 20 మ్యాచుల్లో 13 విజయాలను సాధించాడు
Read More »అక్షర పటేల్ అరుదైన రికార్డు
ఇంగ్లాండ్ తో మొతెరా క్రికెట్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక డే/నైట్(పింక్ బాల్) టెస్టులో అత్యధిక వికెట్లు(11/70) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (10/62), విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174) ఉన్నారు. అటు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా …
Read More »తొలిసారిగా బుమ్రా..?
టీమిండియాలో స్పీడ్ స్టర్ జస్పీత్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తొలిసారి స్వస్థలం అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్లు, అభిమానుల మధ్య బుమ్రా తన టాలెంట్ ప్రదర్శించనున్నాడు. కాగా 17 టెస్టులు ఆడిన తర్వాత ఇటీవలే స్వదేశంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ …
Read More »