దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణనాథుడి వద్ద సందడి షురూ అయ్యింది. ఈ భారీ పంచముఖ మహాలక్ష్మీ విగ్నేశ్వరుడుకి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 50 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. జూన్ 10 నుంచి 150 మంది కళాకారులు 80 రోజులు …
Read More »గణపతికి గరిక ఎందుకు పెడతారు..?
సహజంగా దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. …
Read More »కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది?
విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ముల్లోకాలకు ప్రీతిపాత్రుడు. గంభీరమైన రూపం అతనిది. గణాధిపతిగా కొలువుదీరి.. విఘ్ననాయకుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతీ సంవత్సరం.. సకల జనుల పూజలు అందుకుంటాడు. నవరాత్రి వేడుకలతో లోకంలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాడు. అలాంటి గణేశుడి గురించి.. వినాయక చవితి గురించి.. గణేశుడితో సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి.. పూజ గురించి.. నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకొని వినాయక ఉత్సవాలు జరుపుకొందాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతికి ప్రాధాన్యమిద్దాం. గల్లీకో …
Read More »వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకుడికి పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు …
Read More »ఈసారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఎంతో తెలుసా..?
బొజ్జ గణపతులందు ఖైరతాబాద్ గణపతి వేరు! ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ తొండమునేకదంతంతో.. కొండంత రూపంతో భక్తులను కాచేభవహరుడు ఆ స్వామి!! 2019లో అక్కడ 65 అడుగుల ఎత్తైన గణేశుడి ప్రతిమను రూపొందించిన నిర్వాహకులు.. ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం 9 అడుగుల ఎత్తుతో ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ స్వామికి అటూ ఇటూ లక్ష్మి, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు
Read More »వినాయకచవితి నాడు పూజ ఇలా చేస్తే… విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు..?
సకల దేవతాగణముల అధిపతి… ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు.. విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన భాద్రపద శుక్ల చతుర్థినాడు వినాయకచవితి పర్వదినంగా జరుపుకుంటారు. సర్వదేవతాగణాధిపతిగా వినాయకుడిని ప్రకటించిన ఈ రోజునే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగవినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి. వినాయకుడిని …
Read More »వినాయక చవితి ప్రాశస్త్యం ఏమిటీ…!
ఈరోజు వినాయకచవితి…సకల దేవతాగణముల అధిపతి… శ్రీ గణనాధుడు… తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు…. సర్వ విద్యలకూ అధినాథుడు. ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఈ రోజునే వినాయకుడిని సర్వదేవతాగణాధిపతిగా ప్రకటించిన రోజు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. ఈ పండుగ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు మొదలువుతుంది. దక్షిణాయనం, శ్రావణమాసం, …
Read More »