స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
Read More »హైకోర్టు సీజేతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …
Read More »విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్ బైక్
విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొన్నాననే ఆనందం ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి శుక్రవారం కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. బైక్ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్‌రూంలో ఛార్జింగ్ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు …
Read More »మా విచారణకు హాజరు కావాలి: చంద్రబాబుకు నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »వామ్మో.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రూ.10 కోట్ల క్యాష్.. 10 కేజీల గోల్డ్!
ఏపీలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన పేపర్లు చూపించకపోవడంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఉభయ గోదావరి జల్లాల్లో ఈ తనిఖీలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణవరం సమీపంలో హైవేపై పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ట్రావెల్స్ బస్సులను చెక్ చేశారు. ఆ …
Read More »విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఈనెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. * రైలు నంబరు 02449-02450 షాలిమార్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు …
Read More »మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత
ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More »మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
Read More »మార్చి 31వరకూ ఇంద్రకీలాద్రి దర్శనాల రద్దు.. వస్తే వైద్య పరీక్షలు !
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో విజయవాడ దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమి నాయుడు పేర్కొన్నారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను సైతం రద్దు చేశామన్నారు. అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, లిఫ్టులను నిలిపి వేశామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ వైద్యపరీక్షలు …
Read More »