సినీ డైరెక్టర్, ఎస్వీబీసీ చైర్మన్ కె.రాఘవేంద్రరావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆయన వాహన ర్యాలీ లోని స్కార్పియో అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది.ఆ వాహనంలో ఉన్న డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనంలో రాఘవేంద్రరావు లేరని, వెనుక మరో వాహనంలో ఉన్నారని సమాచారం అందుతోంది. కొద్దిలో ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో ఉన్నవారు పేర్కొన్నారు.
Read More »