ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో వాహనాన్ని ఎండలో పార్క్ చేస్తే షైనింగ్ తగ్గిపోతుంది. ఇంజిన్ కంపార్ట్మెంట్పై ప్రభావం పడుతుంది. ఏసీ సరిగ్గా పనిచేయకపోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా దెబ్బతింటుంది. టైర్లలో గాలి తగ్గడం, పగిలిపోయే అవకాశం ఉంది. అయితే కార్లను ఎండలో పార్క్ చేస్తే సోలార్ ఆధారంగా పనిచేసే ఫ్యాన్ అమర్చాలి. దానంతట అదే తిరుగుతూ లోపల వేడిని తగ్గించేందుకు కొంత ఉపకరిస్తుంది.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »రూ.6 కోట్ల 75 లక్షలతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి జగన్, మంత్రుల భద్రత మరింత పెరగనుంది. రూ.6 కోట్ల 75 లక్షలతో ఏపీ సర్కారు 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేయనుంది. టయోటా ఫార్చూనర్ వాహనాలు ఒక్కోటి రూ.34.10 లక్షలకు కొనుగోలు చేయనున్నారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్గా మార్చేందుకు మరో రూ.33.40 లక్షలు ఖర్చు పెట్టనున్నారు. వీటిని సీఎం, మంత్రులు, వీవీఐపీలు, సీనియర్ పోలీసు అధికారులు వినియోగించనున్నారు.
Read More »ఎంపీ వాహనంపై దాడి
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్ నేతపై తృణమూల్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన …
Read More »టీడీపీ ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం..?
పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. …
Read More »