తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు పెంపు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచాలని ఆర్టీసీ యా జమాన్యం నిర్ణయించింది. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీని రూ.20లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మెట్రో డీలక్స్‌లో రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25కు పెంచే అవకాశం ఉంది. జిల్లాల్లోని …
Read More »త్వరలోనే TsRTC ఛార్జీలు పెంపు
TS ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెరగనున్నాయి. త్వరలోనే చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రెండేళ్లుగా డీజిల్ రేట్లు 30శాతానికి పైగా పెరిగి ఆర్టీసీపై భారం పడుతుండడంతో టికెట్ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులపై ఎక్కువ భారం మోపకుండా చార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »