తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »ఆధిక్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లో జరుగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్లు పొందిన అభ్యర్థుల వివరాలు… వాణీదేవి – 2, 354 రామచంద్రరావు – 1,897 ప్రొఫెసర్ నాగేశ్వర్ – 2,132 చిన్నారెడ్డి – 1,325 ఇప్పటివరకు అభ్యర్తుల మెత్తం ఓట్లు… టీఆర్ఎస్ …
Read More »త్వరలోనే మరో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
హైదరాబాద్ జలవిహార్‌లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరస్పాండెన్స్, టీచర్ల సమావేశంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణీదేవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ లాంటి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అన్ని బంద్ చేసుకుని ఇంట్లోనే ఉండి ఇబ్బందుల పాలవుతామని అసలే ఊహించలేదు. గతేడాది మార్చిలో …
Read More »వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్‌నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవీ సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలినే ఎన్నుకుందాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనిలో స్థానిక నాయకుడు శ్రీకర్ గుప్త గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన టీఆర్ఎస్ …
Read More »పి వి గౌరవాన్ని పెంచుదాం- మాజీ మంత్రి జోగు రామన్న
సురభి వాణి దేవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన తెలంగాణ భూమి పుత్రుడు మన మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు గారి గౌరవాన్ని పెంచుతామని మాజీ మంత్రి MLC ఎన్నికల ఇంచార్జి జోగు రామన్న అన్నారు మంచాల మండల కేంద్రంలో MLC కో ఆర్డినేటర్ ల సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్ఛేసిన జోగురామన్న గారు గ్రామాల వారిగా ఇంచార్జి లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆ సందర్భంగా …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ0 నుండి పోటీ చేస్తున్న మాజీ ప్రదాని పి.వి. నర్సింహరావు కుమార్తె సురభి వాణీ దేవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథ0 అన్నారు.శాంతి నగర్ లోని వడ్డేపల్లి మాజీ జడ్పిటిసీ శ్రీనివాసులు స్వగృహంలో టి ఆర్ ఎస్ నాయకులు మందా శ్రీనాథ్, వడ్డేపల్లి …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …
Read More »