తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.సాగర్ (71) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్ రాధాకృష్ణన్ వీధిలోని తన స్వగృహంలో నివశిస్తున్న సాగర్.. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారంఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాగర్‌కు భార్య మాలా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాగర్ పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్ రెడ్డి. సినీ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వి.సాగర్‌గా ఖ్యాతిగడించారు. …
Read More »