తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.
Read More »