ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …
Read More »యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటిస్తారా..?. వచ్చేడాది చివరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. అయితే, దీనిపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ కోసం ప్రియాంక ఎంతో శ్రమిస్తున్నారని ఖుర్షీద్ చెప్పారు.
Read More »