కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »సర్కారు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష నర్లకు తెలంగాణ సర్కారు బంపర్ బొనాంజా ప్రకటించింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ వారికి అలవెన్సులు భారీగా పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇంటిని కట్టుకోవాలను కొనే ఉద్యోగులకు అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్ట్ ఇలా అనేక రకాల భత్యాలను భారీగా పెంచింది. ఈ మేరకు ఆర్థి క శాఖ మంత్రి హరీశ్ రావు శుక్ర వారం ట్విట్టర్ …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఢిల్లీ చేరుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. సమావేశం అనంతరం మాజీ ఎంపీ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డా౹౹ మంద జగన్నాథ్ గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ గారు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గార్లతో …
Read More »తెలంగాణలో కొత్తగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 నూతన బీసీ డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి శుక్రవారం జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు. ఈ ఏడాది ప్రారంభించబోయే బీసీ డిగ్రీ గురుకులాలు ఇవే జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, …
Read More »టీకాంగ్రెస్ లో వర్గపోరు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు.. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దెబ్బతో రేవంత్‌రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరుద్యోగ నిరసన దీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ పోరులో అసలు కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది.ఉత్తమ్, రేవంత్ మధ్య నిరుద్యోగ నిరసన దీక్ష అగ్గి రాజేసింది. ఈ నెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో …
Read More »అగ్నిపథ్ తో దేశభద్రతకు ముప్పు: Mp ఉత్తమ్ కుమార్
కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, జేడీ శీలం, సల్మాన్ ఖుర్షీద్, ఉత్తమ్, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు తదితరులు జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌తో దేశభద్రతకు ముప్పుని అన్నారు. ప్రపంచంలో …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా టూర్‌లో ఉన్న రేవంత్ తాను వచ్చాక ఈ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పినప్పటికీ సీనియర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన లేకుండా జూన్ 1,2 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల కాంగ్రెస్ కేంద్ర …
Read More »రాహుల్ రాకముందే టీకాంగ్రెస్ లో మహిళా నేతలకు అవమానం
తెలంగాణలో రాహుల్ గాంధీ సభలకు హాజరయ్యేందుకు గాంధీ భవన్లో పాసులు జారీ చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అధినాయకత్వం. అయితే మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు పంపిణీ సరిగా జరగడం లేదని మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్య నేతలకు పాసులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసహనం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »పాలేరు కాంగ్రెస్ లో ముసలం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న రాయల నాగేశ్వరరావు పై సోషల్ మీడియా వేదికగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఏనాడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని నాయకుల కు ఈనాడు పదవులు కట్టబెడుతున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదని …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత రేవంత్ ఎన్నో ఆరోపణలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ …
Read More »