ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్ చేశారు.
Read More »ఎమ్మెల్సీగా ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయిన …
Read More »