కరోనా మహమ్మారికి సామాన్యులతో పాటు రాజకీయ నేతలు బలవుతున్నారు. తాజాగా యూపీ మంత్రి కమలా రాణి(62) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా బారిన పడటంతో గత నెల 18న చికిత్స కోసం లక్నోలోని రాజధాని కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. ఇటు మంత్రి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి రద్దు చేసుకున్నారు.
Read More »