మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తనను మోసం చేశారని.. తాను లేవలేని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై కుట్ర పన్నారని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే అన్నారు. సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కూలిపోయే విషయంలో షిండే వ్యవహరించిన తీరుపై ఉద్ధవ్ తీవ్రంగా మండిపడ్డారు. షిండేను నమ్మడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. ఆయన్ను తానే సీఎంగా చేసినా అతడిలో …
Read More »ఎంపీ నవనీత్ కౌర్ ,ఆమె భర్త రవి రాణాకు పోలీసులు నోటీసులు
మహారాష్ట్ర ఎంపీ,ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త రవి రాణా(ఎమ్మెల్యే)కు పోలీసులు నోటీసులు పంపించారు. వారిద్దరూ కలిసి మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో అలర్టైన ముంబై పోలీసులు వారికి నోటీసు పంపారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివేందుకు శివసేన అధిష్ఠానం అనుమతించనందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని నవనీత్ దంపతులు చెప్పారు.
Read More »బలపరీక్షలో నెగ్గిన ఉద్దవ్ ఠాక్రే..!!
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నెగ్గారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. అయితే ప్రతిపక్ష బీజేపీ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నారని మాజీ సీఎం ఫడ్నవీస్ ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ నియామకం అనైతికంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ ఇవాళ సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ వాకౌట్ చేసిన …
Read More »