రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
Read More »రైతుబంధు సాయం రైతుకే ఇవ్వాలి-బ్యాంకర్లకు మంత్రి హారీష్ ఆదేశం
తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో …
Read More »వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్‌లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 22న సీఎం గ్రామ సందర్శనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ రోజు ఊరంతా కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పారు. గ్రామ సభ …
Read More »లేక్ వ్యూ డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మురికివాడగా ఉన్న ఏరియాను అభివృద్ధి చేసి, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంపై …
Read More »తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవలే 19 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ప్రారంభించారని తెలిపిన కేటీఆర్.. 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, డాక్టర్ అరుణ్, డాక్టర్ నందిత, డాక్టర్ ప్రసాద్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య …
Read More »ట్విట్టర్ కు షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని సమాచారం. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం …
Read More »మంత్రి కేటీఆర్ ఔదార్యం
కరోనాతో తండ్రి మరణించగా, ఓ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకోవాలంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ముగ్గురి పిల్లల పట్ల ప్రత్యేక చొరవ చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులపూర్ గ్రామానికి చెందిన భూసి సత్తయ్య గత 2 నెలల క్రితం గల్ఫ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. సత్తయ్యకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ …
Read More »మంత్రి కేటీఆర్ పై సోనుసూద్ ప్రశంసలు
తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. …
Read More »విజయసాయిరెడ్డికి అనిత కౌంటర్
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »ఇది తెలంగాణ విజయం – మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానాన్ని కేంద్రం ఆమోదించడం సంతోషకరం అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం తెలంగాణ విజయం అని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోనల్ విధానంతో యువత న్యాయమైన వాటా పొందొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »