తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతిస్తున్న కానిస్టేబుల్ నిర్వాకాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు …
Read More »వెంకన్నను సన్నిధిలో ముకేశ్ అంబానీ.. శ్రీవారికి భారీ విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకం, నిజపాద దర్శసేవలో పాల్గొన్నారు. అనంతం వడ్డీకాసుల స్వామికి రూ.1.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. తర్వాత తిరుమల గోశాలను దర్శించారు. ముకేశ్‌తో పాటు ఆయన రెండో కొడుకు అనంత్ అంబానీ కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీలు …
Read More »TTD చరిత్రలోనే అత్యధిక ఆదాయం
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేరకు తిరుమల …
Read More »తిరుమలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
Read More »టీటీడీ సంచలన నిర్ణయం
ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో …
Read More »ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More »తిరుమలకు భారీగా భక్తులు.. 30 కంపార్ట్‌మెంట్లు ఫుల్
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సర్వదర్శనం టోకెన్లు లేని సుమారు 17వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలోనూ క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 10 నుంచి 15 …
Read More »తిరుమల ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు
తిరుమల ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి కొండపైకి వెళ్తున్న టీటీడీ ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎగువ ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ధర్మరథం బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయి బస్సును లింక్ రోడ్డులో ఆపేయడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటలు చెలరేగినపుడు బస్సులో భక్తులెవరూ లేరు. బస్సు ఇంజిన్‌లో …
Read More »శ్రీవారి సేవలో Uppal MlA
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన …
Read More »టీటీడీ అన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది. కాగా, …
Read More »