తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.
Read More »సీఎం కేసీఆర్ తో కేకే భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ నేత కే కేశవరావుతో భేటీ అయ్యారు. కేకేతో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయయరు. ప్రస్తుతం పదమూడు రోజులగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె,హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More »రోడ్డెక్కిన 62% ఆర్టీసీ బస్సులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 11వ రోజైన మంగళవారం కూడా రాష్ట్రంలో ఎక్కడా సమ్మె ప్రభావం కనిపించలేదు. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో మంత్రి అజయ్ కుమార్ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు …
Read More »చర్చలకు ఆహ్వానిస్తే మేము సిద్ధం-ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ,పార్లమెంటరీ నేత కేకే ఆర్టీసీ సిబ్బంది ఆలోచించాలి. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి. ఇప్పటి వరకు తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ నేతలు కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడా …
Read More »తెలంగాణలో దసరా సెలవులు పొడిగించే అవకాశం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంబంధించిన కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయడంతో టీఆర్‌ఎస్ సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. ఆదివారానికి దసరా సెలవులు పూర్తయ్యి, సోమవారం పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఇప్పట్లో ఆ సమస్య తీరే అవకాశం లేనందున సెలవులను మరో మరో రెండు, మూడు రోజులపాటు పొడిగించే అవకాశం …
Read More »ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే
తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది. ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు …
Read More »ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ తాజా ప్రకటన
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సమ్మెపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి ముగిసింది. చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది …
Read More »నిన్న జయలలిత.. నేడు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము. విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది …
Read More »ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …
Read More »సగం బస్సులు అద్దె బస్సులే
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మీడియాకు విడుదల చేశారు. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ”తెలంగాణ ఆర్టీసీలో భవిష్యత్ లో నడుపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయి. మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివి ఉండాలని నిర్ణయం జరిగింది. ఈ …
Read More »