తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆఫర్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ అనుభవాలను చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు పంపిన అనుభవాల్లో నుంచి గుండెలకు హత్తుకునేలా ఉన్న అనుభవాలను పంపిన వారికి టీఎస్ఆర్టీసీ తరఫున రివార్డులు ప్రకటిస్తారని వీసీ సజ్జనార్ చెప్పారు. సో మీరు ట్రై చేయండి అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Read More »ఉగాది పండుగ నాడు TSRTC బంపర్ ఆఫర్
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉగాది (శనివారం) రోజున 65 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఈనెల 10 వరకు పార్శిల్స్‌పై 25 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్‌పాస్ కేంద్రాలకు …
Read More »యాదాద్రికి ఆర్టీసీ బస్సులు… చార్జీలు ఎంత అంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ …
Read More »వెంటాడిన మృత్యువు.. టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …
Read More »కేంద్రానికి మంత్రి పువ్వాడ వార్నింగ్
వచ్చే ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.ఈ రోజు శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఏప్రిల్ రెండు వరకు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పందన కోసం చూస్తాము… ఎలాంటి స్పందన లేకపోతే ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి …
Read More »గ్రేటర్ ఆర్టీసీలో పెను మార్పులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ ఆర్టీసీలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించిన ఈడీతో పాటు ఇద్దరు ఆర్‌ఎంలు, 29 మంది డీఎంల బదిలీల నేపథ్యంలో గ్రేటర్‌లో బస్సుల ఆపరేషన్స్‌పై ప్రభావం పడకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ జోన్ నూతన ఈడీ ఈ.యాదగిరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో …
Read More »TSRTC మరో Good News
తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. …
Read More »సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు పెంపు
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచాలని ఆర్టీసీ యా జమాన్యం నిర్ణయించింది. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీని రూ.20లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మెట్రో డీలక్స్‌లో రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25కు పెంచే అవకాశం ఉంది. జిల్లాల్లోని …
Read More »