తెలంగాణ ఆర్టీసీ సంస్థ ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ కు శ్రీకారం చుట్టింది. మొదటగా ఈ పాస్ ను కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబూబ్ నగర్ లో పదికిలోమీటర్ల, నిజామాబాద్, నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయచ్చు.. పాస్ ధరను పది కిలోమీటర్ల పరిధికి నెలకు …
Read More »ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌లు
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ …
Read More »టీఎస్‌ఆర్టీసీ నుండి తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులు
టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్ …
Read More »తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న మరో డీఏ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో రెండు డీఏలను ప్రకటించిన సంగతి విదితమే. ఈ డీఏలను ఈ నెల జీతంతో కలిసి 3.9 శాతం డీఏను నేడు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు …
Read More »తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు
భారత స్వాతంత్య్ర వజోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 75 ఏళ్లు దాటిన వృద్ధులకు నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కేజీ పార్సిల్ 75KM ఉచితంగా పంపించవచ్చని పేర్కొంది. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో రూ.75కే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ కొని రోజంతా జంటనగరాల్లో ప్రయాణించవచ్చు. ఇవాళ పుట్టిన పిల్లలందరూ 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని …
Read More »ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్
ఈ నెల 19న ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Read More »తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వాటర్ బాటిల్స్!
ప్రయాణికుల కోసం వాటర్ బాటిళ్లు తయారు చేసి విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. దీని కోసం మంచి డిజైన్‌ను సూచించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మంచి వాటర్ బాటిల్ డిజైన్ సూచించి ప్రైజ్ మనీ గెలుచుకోవాలని సజ్జనార్ కోరారు. ప్రయాణికుల కోసం అరలీటర్, లీటర్ పరిమాణాల్లో ఈ వాటర్ బాటిళ్లను అందజేయనున్నారు. ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ మార్పులకు తోడ్పాటు అందించాలని ప్రజలకు …
Read More »టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ …
Read More »తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More »తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా 1,016 బస్సులు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కొత్తగా 1,016 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని తీర్మానించారు. బస్టాండ్లలో ఫార్మసీ సేవలు తీసుకురావాలని నిర్ణయించారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి పెంచాలని తీర్మానించారు.
Read More »