తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన.. పైనుండి వస్తున్న వరదల వలన ఆల్మట్టి,నారాయణ్ పూర్ నుంచి కృష్ణానది పరవళ్లు తొక్కుతూ వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వస్తున్నాయి.దీనివలన జూరాల నిండిన వెంటనే నెట్టెంపాడు,బీమా,కోయిల్ సాగర్ లిప్టులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీచేశారు. భారీగా వరద వచ్చే అవకాశమున్నందున పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం …
Read More »హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి
హరితహారం కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామపంచాయతీలకు ప్రభుత్వ పరంగా నిధుల విడుదలలో, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్లూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అన్ని గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి దయాకర్రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘హరితహారంతో …
Read More »“అదే”ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం
తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ,సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై నిన్న సోమవారం చింతమడకలో జరిగిన గ్రామ ప్రజల ఆత్మీయ సమ్మేళన సభలో ఆద్యంతం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన చింతమడక ప్రజల కోసం హరీశ్ బాగా తిప్పలు పడ్డాడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా సభలో హారీష్ రావు మాట్లాడుతూ”సిద్దిపేట …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ సంచలన నిర్ణయం
స్పందించే హృదయంతో, అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ …
Read More »గోదావరి-కృష్ణా అనుసందానికి ప్రణాళికలు
కృష్ణా-గోదావరి నదుల అనుసందానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు గాను ఇంజినీర్ పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 19 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో పాటు కోటి రూపాయల అంచనా వ్యయం తో 11 వార్డులో నిర్మించ తల పెట్టిన యస్ సి కమ్యూనిటీ హాల్ కు ఆదివారం ఉదయం …
Read More »ఫించన్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ
తెలంగాణలో వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పేదరికం ఉన్నంతకాలం ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న అన్నిరకాల వనరులను సద్వినియోగం చేసుకుంటే పదేళ్లలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ …
Read More »సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో జరుగుతోంది. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్‌రావు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్ …
Read More »అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది
సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం …
Read More »తెలంగాణ వ్యాప్తంగా”ఆసరా”పండుగ
తెలంగాణలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ”తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆసరా పింఛన్లను డబుల్ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస ఎన్నికలతో కోడ్ ఉండటంతో ఇచ్చిన …
Read More »తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లులివే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలు బిల్లులను ఈ రోజు గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టం – 2019 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ప్రభుత్వం బిల్లుపై సవరణలు స్వీకరించనుంది. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ …
Read More »