తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఇతర రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఇండ్ల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ విధానం విజయవంతం కావడంతో పంజాబ్, తమిళనాడు తదితర రాష్ర్టాలు అమలు చేయడానికి ముందుకొచ్చాయి. …
Read More »టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, …
Read More »టి.ఎస్-బిపాస్ అమలుకు సమాయత్తం కావాలి
టి.ఎస్ ఐపాస్ వలే అనుమతులను సులభతరం చేసి నిర్ణీత కాలంలో జారీచేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న టి.ఎస్-బిపాస్ అమలుకు సమాయత్తం కావాలని టౌన్ప్లానింగ్ అధికారులకు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు పిలుపునిచ్చారు. టి.ఎస్-బిపాస్పై అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. అందరం పౌరులుగా ఆలోచిద్దామని చెప్పారు. గురువారం ఎం.సి.హెచ్.ఆర్.డిలో హెచ్.ఎం.డి.ఏ, జిహెచ్ఎంసి, డి.టి.సి.పి టౌన్ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మార్చిలో ప్రయోగాత్మకంగా చేపట్టి, ఏప్రిల్ 2వ తేదీ నుండి పూర్తిస్థాయిలో …
Read More »