తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణగౌడ్ ఈ నెల 18 బీజేపీలో చేరనున్నారు. ఫతేనగర్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్, సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్ది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Read More »గ్రీన్ చాలెంజ్ లో అందాల భామలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు. మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పాల్గొన్నది. హీరో నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను …
Read More »ఇప్పటికి ధరణి రిజిస్ట్రేషన్లు 12,705
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంటున్నది. ధరణి పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 10 రోజుల్లోనే 12,705 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 8,488 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 12,705కు చేరుకున్నది. అంటే రెండ్రోజుల్లోనే 4,217 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజులుగా సగటున రెండువేలకు మించి రిజిస్ట్రేషన్లు, …
Read More »“ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని …
Read More »ఆరేండ్లలో 28 వేల పోలీసు నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్‌తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన …
Read More »దక్షిణకొరియా కంపెనీలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్‌లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్‌సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Read More »ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »