ఒకవైపు సంక్షేమంలో మరోవైపు అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తొక్కేయాలని చూస్తు న్నా, రాష్ట్రాభివృద్ధికి అవార్డులు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. శనివారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్ విధానాలపై ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ …
Read More »YS షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెడతారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి,దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా ప్రకటన నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రజారాజ్యం పేరుతో వచ్చిన చిరంజీవి,జనసేనతో వచ్చిన పవన్ లు పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశమే …
Read More »మేయర్ ఎన్నిక.. కార్పొరేటర్లు, మంత్రులతో కేటీఆర్ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ ఎన్నిక సందర్భంగా కొద్దిసేపట్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లు, నగర పరిధిలోని మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే నగరానికి చెందిన ఎక్స్‌అఫిషియో సభ్యులతో భేటీకానున్నారు. సమావేశంలో పార్టీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు. మేయర్ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని కేటీఆర్ వివరించనున్నారు. సమావేశం అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి కార్పొరేటర్లు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. మేయర్ ఎన్నిక కోసం …
Read More »దళితులు సంపూర్ణ సాధికారతే మా లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా హాలియాలో …
Read More »పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే జిల్లా. మన గిరిజన సోదరులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చాలా సమస్యల మాదిరిగానే పోడు భూముల సమస్యను కూడా పెండింగ్‌లో పెట్టిండ్రు. పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అటవీశాఖ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటిరెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల …
Read More »నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్‌ఎస్ జెండా ఎగురేయండి. టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి …
Read More »హద్దుమీరితే తొక్కేస్తాం
మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం …
Read More »రైతుబంధు కోసం రూ.14,500కోట్ల నిధులు
తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు …
Read More »తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత …
Read More »నేడే మేయర్ ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వేళయింది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ విప్ జారీచేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని …
Read More »