కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన.. ’90శాతం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ ను తమ పార్టీగా ప్రజలు భావిస్తారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ ఉండగా.. కోడలైన షర్మిల మా రాష్ట్రానికి అవసరం లేదు. టీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి’ అని …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి కి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , డా. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఆరోగ్యం విషమంగా ఉంది. వో ప్రైవేట్ దవాఖాన లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని …
Read More »పట్టణాల చుట్టూ కూరగాయల సాగు పెరగాలి-సీఎం కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మూస పద్ధతిలో సాగింది. వరికే ప్రాధాన్యమివ్వడంతో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణలో సాగు బాగా వెనకబడిపోయింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లాంటి తక్కువ నీటితో సేద్యమయ్యే ఉద్యానసాగు విస్మరణకు గురైంది. వ్యవసాయంలో అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణలో నేలల స్వభావం, పంటలకు అనుగుణంగా తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించే ఉద్యానపంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి. మనకు అద్భుతమైన భూములున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుతున్నది. ఇప్పుడన్నా …
Read More »రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జ్ గా మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ,హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి పద్నాలుగు తారీఖున జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంచార్జులను నియమించారు. మహబూబ్ నగర్ జిల్లాకు ఇంచార్జ్ గా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి తన్నీరు …
Read More »కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా
జీతం జానెడు.. చాకిరీ బారెడు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరుచూ వినిపించిన మాట. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక.. వాటిని విడువలేక ఆయా కుటుంబాలు పడిన బాధలెన్నో. స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం, అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం.చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం ఎప్పుడూ పైస్థాయి …
Read More »చిరుద్యోగులకు టీఆర్ఎస్ సర్కారు బాసట
తెలంగాణలోని ఒప్పంద, పొరుగుసేవల, దినవేతన, తాత్కాలిక ఉద్యోగులకు గత ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వరకు వేతనాలను పెంచిందని, దానిపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సూచించారు. పట్టభద్ర ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, చిరుద్యోగులకు వేతనాల పెంపు వివరాలను తెలియచెప్పాలన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ” తెలంగాణ …
Read More »దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ
దేశంలో 2020-21 సం.లో పత్తి సాగులో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 104. 40 లక్షల ఎకరాల్లో సాగుతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా 59.63 లక్షల ఎకరాల్లో సాగుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 4% సాగు పెరిగింది. రాష్ట్రంలో నల్గొండ, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, సంగారెడ్డి ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగు అవుతోందని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పేర్కొంది.
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేసిన 175 సభ్యత్వాలు, రుసుమును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారికి తన నివాసం వద్ద కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని అభినందించారు. సభ్యత్వ నమోదుకు తక్కువ సమయం ఉన్నందున నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాడ వాడలా తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ …
Read More »జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మరిన్ని అధికారాలు, నిధులు కల్పించి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కోరారు టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు స్థానిక పరిపాలనలో మరింత భాగస్వామ్యం కల్పించడo, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు వంటి …
Read More »